ఇటీవల మీడియాలో గణాంకాలే ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌: విజ‌య‌శాంతి

27-09-2021 Mon 11:25 | Both States
  • తెలంగాణలో ఆ బంధు... ఈ బంధు అంటున్నారు
  • ఎన్నికలప్పుడు లేనిపోని హడావుడి చేస్తున్నారు
  • కేసీఆర్ గారు విద్యావంతుల పాలిట రాబందులా మారారు
  • నివేదిక ప్రకారం 60 వేలమంది విద్యావంతులు స్ట్రీట్ వెండర్లుగా మారారు
  • తోపుడు బండ్లతో రోడ్ల మీదికి వచ్చారు  
తెలంగాణ‌లో నిరుద్యోగులు ప‌డుతోన్న బాధ‌ల‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి స్పందిస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 'తెలంగాణలో ఆ బంధు... ఈ బంధు అంటూ ఎన్నికలప్పుడు లేనిపోని హడావుడి చేసే సీఎం కేసీఆర్ గారు విద్యావంతుల పాలిట రాబందులా మారారు. ఇందుకు అతి పెద్ద ఉదాహరణ, ఇటీవల మీడియాలో గణాంకాలతో సహా బయటికొచ్చిన తెలంగాణలోని విద్యావంతుల పరిస్థితి' అని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని పోస్ట్ చేశారు.

'ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో దాదాపు 60 వేలమందికి పైగా విద్యావంతులైన యువతరం మరో మార్గం లేక స్ట్రీట్ వెండర్లుగా మారి తోపుడు బండ్లతో రోడ్ల మీదికి వచ్చారు. నోటిఫికేషన్లు రాపు... ఉద్యోగాల్లేవు... నిరుద్యోగభృతి లేదు... ఆశనిరాశల మధ్య ఆత్మహత్యలు ఆగడం లేదు' అని విజ‌యశాంతి విమ‌ర్శించారు.

''పట్టణ ప్రగతి - సర్వే ఆఫ్ స్ట్రీట్ వెండార్స్' యాప్‌లో వీధి వ్యాపారుల కేటగిరీలో నమోదైన వివరాలు గమనిస్తే గుండె చెరువయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా స్ట్రీట్ వెండర్స్‌లో పీజీలు చేసినవారు, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసినవారు, కరోనా ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు.... ఇలా ఎందరెందరో కన్నీటి ధారలతో కనిపిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగాల మాట కల్ల అని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా ఈ వార్తా కథనం వాస్తవాల్ని ప్రజల ముందుంచింది' అని తెలిపారు.

'ప్రధానమంత్రి స్వనిధి ద్వారా మోదీగారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.10 వేల రుణమే వీరికి కాస్తో కూస్తో ఊరట కాగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిని వీధిన పడేయటం తప్ప చేసిందేమీ లేదని బాగా తెలిసొచ్చింది' అని విజ‌య‌శాంతి అన్నారు.
VijayashantiBJPKCR

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more